ముగిసిన రుతుపవన సీజన్‌.. 94.4 % వర్షపాతం నమోదు- ఐఎండీ

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం (94 శాతం) నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. సగటున 868.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 820 ఎంఎం నమోదైనట్లు తెలిపింది. లాంగ్ పీరియడ్ యావరేజ్‌‌ (ఎల్‌‌పీఏ)లో 94 నుంచి 100 శాతం మధ్య వర్షపాతం రికార్డయితే ‘సాధారణం’గా పరిగణిస్తారు. ‘‘ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సానుకూల అంశాలతో 2023 రుతుపవనాలు 94.4 శాతం వర్షపాతంతో ముగిశాయి. ఇది సాధారణ వర్షపాతంగా పరిగణనలోకి వస్తుంది” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు. తూర్పు, ఈశాన్య భారతదేశంలో 1,115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణం(1,367.3 మిమీ)తో పోలిస్తే ఇది 18 శాతం తక్కువని వివరించారు. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్‌‌లో పెద్దగా వానలు పడలేదు. జులైలో మాత్రం దేశవ్యాప్తంగా పోటెత్తాయి. తర్వాత ఆగస్టులో కరువు పరిస్థితులు కనిపించాయి. 1901 ఆగస్టు తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సారే. తర్వాత సెప్టెంబర్‌‌‌‌లోనూ అంతంతమాత్రంగానే పడ్డాయి.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్