స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. అందరికంటే తానే పెద్ద హిందువునని కేసీఆర్ చెప్పుకుంటాడని, కానీ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ కు కనిపించడంలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే, కొందరు సనాతన ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై దాడులు చేసే వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.
Lakshman: సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు KCR కు కనిపించడంలేదా?:
0
305
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


