స్వతంత్ర వెబ్ డెస్క్: కరెంట్ కోతలపై వైసీపీ ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. విద్యుత్ కోతలు ఉంటాయని ఒకసారి, ఉండవని మరోసారి ప్రకటన చేశారని… అంటే విద్యుత్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. గ్రామాల్లో తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని, గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ కోతతో అల్లాడుతున్నారని చెప్పారు. ప్రజలు విద్యుత్ కార్యాలయాలను ముట్టడించే పరిస్థితి ఉందని అన్నారు. ఒక రోజుకు 240 మిలియన్ యూనిట్లు అవసరమైతే, కేవలం 198 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోందని విమర్శించారు. విద్యుత్ అవసరాలు, వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నివారించాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని దుయ్యబట్టారు.
విద్యుత్ విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు- పురందేశ్వరి
0
295
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


