రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు.. ఎక్కడెక్కడంటే.?

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే  కొత్తగా మరో 20 కేజీబీవీలు మంజూరు చేస్తూ మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  20 కేజీబీవీల ఏర్పాటుకుగాను వార్షిక రికరిం గ్ బడ్జెట్‌గా రూ. 60 లక్షలను సైతం మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కొత్త మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో 20 కేజీబీవీలను నెలకొల్పాల్సి ఉండగా.. వాటి కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదనలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కెజిబివిల ఏర్పాటు కు ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో రాష్ట్రంలో కేవలం391కెజిబివిలు ఉంవడగా,2017 18 లో కొ త్తగా 84 కెజిబివిలను ప్రభుత్వం మం జూరు చేసింది. దీంతో రాష్ట్రంలో కెజిబివిల సం ఖ్య 475కి చే రింది. తాజాగా మరో 20 కెజిబివిలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495 కు చేరింది.

వీటిల్లో  245 కెజిబివిల్లో ఇంటర్, మరో 230 కెజిబివిలను పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. కొత్తగా కెజిబివిలు ఏర్పాటు కానున్న మండలాలు మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్, మాసాయిపేట (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద,మోగుదంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌట్కూరు (సంగారెడ్డి), దూల్మెట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్).

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్