28 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

గొల్లపూడిలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్ట్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టిడిపి నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇవాళ తెల్లవారుజామునే గొల్లపూడిలోని మాజీ మంత్రి ఇంటివద్దకు చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో టిడిపి శ్రేణులు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగి గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల హౌస్ అరెస్ట్ తో మాజీ మంత్రి తన ఇంటివద్దే నిరసనకు దిగారు.

అధికార వైసిపి ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగించేందుకు టిడిపి నాయకులు సిద్దమయ్యారు. ఇలా ఇవాళ ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టిడిపి పిలుపునిచ్చింది. వైసిపి నాయకుల ఇసుకదోపిడీకి సంబంధించిన ఆధారాలను డిఎంజి డైరెక్టర్ కు అందజేయాలని టిడిపి నాయకులు భావించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో దేవినేని ఉమ ఇంటివద్దే నిరసన చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్