Jawan: అబ్బురపరిచే 5 డిఫరెంట్ లుక్స్‌లో షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా ‘జ‌వాన్‌’. న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రివ్యూ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ రోజు నుంచే షారుఖ్‌ఖాన్ తెర మీద ఎన్ని కోణాల్లో క‌నిపిస్తారోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్యాపించింది. ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పింది ప్రివ్యూ. యాక్ష‌న్ గురించి జ‌నాలు ఎంత‌గా మాట్లాడుకుంటున్నారో, జ‌వాన్ సినిమాలో షారుఖ్‌ఖాన్ ఎన్ని గెట‌ప్పుల్లో క‌నిపిస్తారోన‌నే విష‌యం గురించి కూడా అంతే క్యూరియాసిటీతో మాట్లాడుకుంటున్నారు. అత‌ని గెట‌ప్పుల వెనుక ఉన్న క‌థ‌ల గురించి ఆస‌క్తిక‌రంగా ఆరా తీస్తున్నారు. సినిమాలోని ఆయ‌న గెట‌ప్పుల‌న్నిటినీ సింగిల్ ఫ్రేమ్‌లోకి తెచ్చే విధంగా కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులోని ఐదు డిఫ‌రెంట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఒక‌దానితో ఇంకోదానికి పోలిక లేకుండా, ప్ర‌తి అవ‌తార్‌లోనూ త‌నకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో మెప్పిస్తున్నారు షారుఖ్‌. ఈ పోస్ట‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ షారుఖ్ ఖాన్ నెవ‌ర్ సీన్ బిఫోర్ అవ‌తార్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పండుగ క‌లిగాస్తార‌ని సంతోషిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? థియేట‌ర్ల‌కు వెళ్దామా? అని ఎదురుచూస్తున్నారు.

జ‌వాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుంది జ‌వాన్‌.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్