బ్రిక్స్ సదస్సులో ఉన్నా నా మనసంతా చంద్రయాన్ 3 పైనే- నరేంద్ర మోదీ

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ(MODI) అభినందనలు తెలిపారు. మనం ఒక అద్భుతాన్ని చూశామన్నారు.  అంతరిక్ష చరిత్రలో  కొత్త చరిత్రను లిఖించామన్నారు.  ఇది నవభారత విజయమని కొనియాడారు మోదీ.  ఇది 140 కోట్ల మంది విజయమని.. ఆజాదీకా అమృత ఘడియల్లో  ఇది తొలి విజయం అని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉన్నా తన  మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉందని చెప్పారు మోదీ. ఇక నవశకానికి కొత్త కథలు చెప్పొచ్చన్నారు మోదీ. చంద్రయాన్ 3 సక్సెస్ తో తన  జీవితం ధన్యమయ్యిందన్నారు. గగన్యాన్ లో కూడా ఇక విజయాలు సాధిస్తామని  చెప్పారు.

చంద్రయాన్ 3 (CHANDRAYAN-3) చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు  చంద్రయాన్ 3 చందమామను ముద్దాడింది. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటింది. చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.. ఇక ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చందమామపై రోవర్ పరిశోధనలు  చేయనుంది.

 

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్