“సర్కారు నౌకరి” సినిమా నుంచి ‘నీళ్లా బాయి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి” (Sarkar Naukari). ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao)నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ (Ganganamoni Shekhar)దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నీళ్లాభాయ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

శాండిల్య పీసపాటి స్వరపర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్ సాహిత్యాన్ని అందించగా సోని కొమండూరి ఆకట్టుకునేలా పాడారు. ‘నీళ్లా భాయి నిమ్మళంగా అడిగే . ఈ సక్కని సుక్కా లగ్గమెప్పుడని, ఎగిరే గువ్వ, ఎన్నెలోలె నవ్వే..ఆ పప్పు బువ్వ సందడెప్పుడని..’అంటూ పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయి మనసులో కలిగే ఎమోషన్స్, కాబోయో భర్త గురించి మొదలయ్యే ఊహలతో ఈ పాట సాగుతుంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్