KTR : దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నాం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో దేశంలోనే తొలి అగ్రికల్చర్‌ డేటా ఎక్సేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ (Minister Ktr) ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఒక రైతు కాబట్టి వ్యవసాయంపై అవగాహన ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామని చెప్పారు.

గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు వలసలు లేవని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు.

Latest Articles

నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి.. నెతన్యాహుతో ట్రంప్‌ వ్యాఖ్యలు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్‌ ఫోన్ కాల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్