ఢిల్లీకి షర్మిల.. కాంగ్రెస్‌తో విలీనంపై నేడో రేపో తుది ప్రకటన ?

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతూండటంతో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో(congress party) విలీనం కోసం ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(ysrtp) అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారు.   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ని  ప్రియాంక గాంధీ(priyanka gandhi) తరపున  చూసుకుంటున్న ఆయన..  చేరికలు, విలీనాల విషయంలో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో డీకే శివకుమార్ తో షర్మిల(sharmila) రెండు, మూడు సార్లు చర్చలు జరిపారు. మరోసారి ఆమె బెంగళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ తో చర్చల తర్వాత ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

షర్మిల పార్టీని విలీనం చేసుకునే విషయంలో కాంగ్రెస్(congress) హైకమండ్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇతర విషయాల్లో  బిజీగా ఉండటంతో ఇంకా చర్చలు ప్రారంభించలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర నేతలు మాత్రం.. షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఆమెను ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని తెలంగాణలో నాయకత్వం వద్దని అంటున్నారు. ఈ అంశంపై డీకే శివకుమార్ (dk shivakumar) తెలంగాణ నేతలతో చర్చలు జరిపి.. ఓ క్లారిటీకి వచ్చారని అంటున్నారు. తెలంగాణ నేతల అభిప్రాయం, షర్మిల విజ్ఞప్తులను హైకమాండ్ ముందు ఉంచి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశం ఉంది.

అయితే, ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీని షర్మిల సోషల్ మీడియా(social media) అదేపనిగా పొగుడుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపైనా స్పందించారు. నిజానికి  రాహుల్ గాందీ లోక్‌సభ సభ్యత్వం.. సోమవారం పునరుద్ధరించారు. ఒక రోజు ఆలస్యంగా షర్మిల రాహుల్ ను అభినందిస్తూ ట్వీట్(tweet) చేశారు. దీనికి కారణం.. విలీన చర్చల విషయంలో ముందుడుగు పడటమేనని భావిస్తున్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్