KTR: మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంట..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయ‌లేదు.. పైస‌లు పంచ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మందు పోయించ‌ను.. పైస‌లు పంచ‌ను. మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటాను అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Ktr) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌న్న సిరిసిల్ల (Rajanna Siricilla) క‌లెక్ట‌రేట్‌లో బీసీ బంధు ప‌థ‌కం(Bc Bandu) చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ (Cm Kcr) పాల‌న సంక్షేమానికి స్వ‌ర్ణ‌యుగంగా మారింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అట్ట‌డుగు వ‌ర్గాల పేద‌ల‌ను ఆర్థికంగా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. ఓట్ల కోసం విప‌క్ష నేత‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు నిలదీయండి. 50 ఏండ్లుగా చేయ‌లేని వారు ఇప్పుడేం చేస్తార‌ని, ఓట్ల కోసం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు చైత‌న్యం ప్ర‌ద‌ర్శించాలి. ప‌ని చేసే ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌లు కాపాడుకోవాలి. ఓట్ల కోసం మందు పోయించి, పైస‌లు పంచేవారిని న‌మ్మొద్దు.

ఓట్ల కోసం(Votes) నా జీవితంలో మందు పోయ‌లేదు.. పైస‌లు పంచ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మందు పోయించ‌ను.. పైస‌లు పంచ‌ను. మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటాను. మందు పోయించి.. పైస‌లు పంచే చిల్ల‌ర రాజ‌కీయం చేయ‌ను. ప్ర‌జ‌లంద‌రికీ అండ‌గా ఉండే బాధ్య‌త నాది. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు రాష్ట్రానికి డోకా లేదు. సెప్టెంబ‌ర్‌లో సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీని సీఎం ప్రారంభిస్తారని కేటీఆర్ తెలిపారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్