Tomato Price Drop: దిగొస్తున్న టమాటా ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే?

స్వతంత్ర వెబ్ డెస్క్: నిన్న, మొన్నటి వరకు అందనంత ఎత్తులో ఆకాశంలో విహరించిన టమాట ధర (tamato price) క్రమంగా కిందకు దిగి వస్తోంది. రెండ్రోజుల నుంచి టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు కిలో టమాటా రూ. 200 లకు పైగా అమ్ముడు పోగా.. రూ. 300 దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ టమాటా ధర తగ్గుతోంది. కిలో టమాటాను రూ. 250కి పైగా అమ్మిన వ్యాపారులే ఇప్పుడు రూ. 63 విక్రయిస్తున్నారు. హైదరాబాద్ రైతు బజార్ లో కిలో టమాటా(tamota) రూ. 63 గా ఉంది. బయట మార్కెట్లలో టమాటా ధర ఇంకా ఎక్కువగానే ఉంది. రూ. 120 నుంచి రూ. 140 వరకు విక్రయిస్తున్నారు. మొన్నటి కంటే రెండ్రోజుల నుంచి మార్కెట్ కు అధిక మొత్తం టమాటా వస్తోంది. 10 రోజుల క్రితం వరకు హైదరాబాద్ (Hyderabad) హోల్‌సెల్ మార్కెట్ కు కేవలం 850 క్వింటాళ్ల టమాటా మాత్రమే రాగా.. సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల పంట వచ్చింది.

ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి అధిక దిగుబడి వస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్ పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలోనే హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్ కు టమాటా వస్తోంది. దీంతో సప్లై ఎక్కువగా ఉండటంతో డిమాండ్ తగ్గింది. దాని వల్ల టమాటా ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కిలో టమాటా రూ. 50 లోపు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్