Chandra Babu : ఏపీలో మొత్తం వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తెస్తాం

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ ప్రభుత్వం వస్తే..వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు చంద్రబాబు. దేవరపల్లిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… పోలవరం పూర్తైతే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం సిరలు పండించొచ్చన్నారు. పోలవరాన్ని ఓ సైకో.. ఓ దద్దమ్మ నాశనం చేస్తున్నాడని..జగనుకు ప్రాధాన్యతలు తెలియవు.. సమస్యలు తెలియవు.. అందుకే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ దుస్థితి అని ఫైర్‌ అయ్యారు.

పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు…వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. గతంలో జగన్ ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని..భారీ కంపెనీలను ఏపీకి తెస్తామన్నారు. అలాగే, వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తెస్తాం…దేవరపల్లి వంటి ప్రాంతాల్లో కూడా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని.. పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి టీడీపీ నేతలు.. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని  చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్