KTR : తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ ఎగుమతులపై .. కేటీఆర్ సమాధానం చెబుతూ.. తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదని అన్నారు. స్టేబుల్ గవర్నెన్స్ కేసీఆర్ నాయకత్వంలో ఉందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీ లో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ నిలిచిందని అన్నారు. ప్రతిపక్షాలు కూడా ఐటీ అభివృద్ధిని అభినందించాల్సినదే అని పేర్కొన్నారు.  44 శాతం ఉత్పత్తి హైదరాబాద్ నుండే అని తెలిపారు. రజినీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైద్రాబాడ్ గురించి చెప్పారని అన్నారు.

కానీ కొంత మంది ఇంకా కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. 1987 లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడిందని గుర్తు చేశారు. మేమే తెచ్చాం అని చెప్పుకునే వారికి తెలుసుకోవాలని అన్నారు. ఈటెల కు కూడా తెలవాలని, హుజురాబాద్ లో కూడా ఐటీ కంపనీ వచ్చిందని, ఇప్పుడు లేదన్న ఈటెల.. మీరు బీజేపీ లోకి వెళ్ళాకా కంపనీ పోయినట్టు ఉందన్నారు. ఐటీని జిల్లాలకు వ్యాపించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో విపక్షాల తీరుపై 30 రోజుల పాటు సభ నిర్వహించాలని అంటున్నారు. అయితే 30 నిమిషాలు అసెంబ్లీలో కూర్చునే ఓపిక లేదని కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న బీఏసీ సమావేశం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. 30 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేత లేఖ రాశారు. 20 రోజుల పాటు మహాసభలు నిర్వహించాలని కోరారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో మేమంతా ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక్కొక్కరు మాత్రమే సభకు హాజరయ్యారు. దీన్ని బట్టి వారికి ప్రజల చిత్తశుద్ధి తెలుస్తుంది. ప్రజల పట్ల వారి ప్రేమ మరియు అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. బయటి డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి. కానీ వారికి 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. వారి పనులు ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ అన్నారు.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్