Weather Update : తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.  ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 3) ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు అన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. బలమైన గాలులు గంటకు 30 – 40 కిలోమీటర్ల వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

 

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్