రైతన్నలకు సీఎం గుడ్ న్యూస్… నేటి నుంచి రైతు రుణమాఫీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగానికి  సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు.  కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు కారణాలు, ఆర్థిక లోటుతో ఇన్నాళ్లు రుణమాఫీకి కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం జాప్యం జరిగిందన్నారు. రైతులకు అందిచాల్సిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని కేసీఆర్ తెలిపారు.

పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు, ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు రైతులను ఆర్థికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును, అధికారులను సీఎం ఆదేశించారు. రైతు బంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో… సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్