Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. ఎన్నెన్నో వ్యూహాలు.. ఏవేవో భావాలు..

స్వతంత్ర వెబ్  డెస్క్: నేటి నుంచి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండటంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు తగిన బదులు ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది. నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు వారం కంటే తక్కువ రోజులే సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఆరు నెలల్లో కనీసం ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున.. గురువారం నుంచి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు, నాలుగు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చునని భావిస్తున్నారు.

గురువారం ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం వ్యక్తం చేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది. ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. అయితే.. ఎన్నికల ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో అనేక సవాళ్లు ఫేస్ కాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బీఆర్ఎస్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు.. ఇలా ఎవరి ప్లాన్‌లో వాళ్ళు సిద్ధమవుతుండడంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని అధికార బీఆర్ఎస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు సమాచార సేకరణ చేశారు. అసెంబ్లీ సమావేశాలు టార్గెట్‌గానే వీఆర్ఎస్‌ల రెగ్యులరైజేషన్‌, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, మెట్రో విస్తరణ, రైతు రుణమాఫీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కాంగ్రెస్, బీజేపీ వ్యూహ రచన…
ఇదిలావుంటే.. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గళం విప్పేందుకు రెడీ అయ్యారు. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండగా.. గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ కొనసాగుతోంది. మిగతా సభ్యులంతా టీ.బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డితో సమావేశమై.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించారు. అటు.. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం కేసీఆర్ కనీసం పరిశీలించకుండా మహారాష్ట్రలో పర్యటించడంపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే.. అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు కమలనాథులు భారీ ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నప్పటికీ.. అసలు మాట్లాడటానికి ఛాన్స్‌ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 మరోవైపు, ఉచిత విద్యుత్‌​పై కాంగ్రెస్ వైఖరి, రాష్ట్రానికి కేంద్ర సాయం వంటి అంశాలను లేవనెత్తి విపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది. మూడు, నాలుగు రోజుల పాటు గత సమావేశాలకు భిన్నంగా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ విలీనం సహా గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను మళ్లీ సభలో పెట్టి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ చర్చ సందర్భంగా కేంద్రం, గవర్నర్ వ్యవస్థ, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రైతు బీమా, ఆర్టీసీ విలీనం వంటి అంశాలను అధికార పక్షం ప్రస్తావించే అవకాశం ఉంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్