Bogota Falls: గీత దాటితే వేటు తప్పదు.. ముఖ్యంగా మందు బాబులకు మరీనూ

స్వతంత్ర వెబ్ డెస్క్: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి ప్రాంతంలోని బొగత జలపాతాల వద్ధ అటవీశాఖ కఠిన నిబధనలకు శ్రీకారం చుట్టింది. పర్యాటకులు మద్యం సేవించడం పై నిషేదం విధించారు. వాహనాల్లో మద్యం బాటిల్స్ కలిగి వుంటే ఆ వాహనం సీజ్ చేస్తారు. బొగత జలపాతం పరిసరాల్లో ఎక్కడ మద్యం సేవించినా రూ. 2000 రూపాయల జరిమానా, ఈరోజు నుండి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అటవీశాఖ వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భోగత జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గీత దాటితే వేటు తప్పదని సూచిస్తున్నారు.

తెలంగాణ నయాగార గా పేరుగాంచిన బొగత జలపాతం వద్దకు ప్రతినిత్యం వందల మంది పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. బొగత జలపాతం ప్రక్రుతి రమణీయ దృశ్యాలను, జాలువారే నీటిని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యటకులు రాకపోకలు సాగిస్తుంటారు. కొంతమంది యువకులు మద్యం సేవించి, మద్యం బాటిల్స్ హల్ చల్ చేస్తున్నారు.. తనిఖీలు చేస్తున్న సమయంలో అధికారుల కళ్ళు గప్పి బ్యాగులలో మద్యం తీసుకు వెళ్తుంటారు. మద్యం మత్తులో స్నానాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటివరకు స్నానాలకు వెళ్లి మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పర్యాటకుల భద్రత కోసం వారి రక్షణ కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్