Earthquake: జైపూర్, మణిపూర్‌లో భూకంపాలు.. ఉలిక్కిపడిన ప్రజలు

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్‌‌లోని ఉక్రుల్ పట్టణంలోని శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5‌గా నమోదైనట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ వెల్లడించింది. ఉదయం 5.01 AM గంటలకు 20 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూడా భూకంపం వచ్చింది. ఉదయం 4.00 AM గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైనట్లు జాతీయ సిస్మాలజి సెంటర్ పేర్కొంది. అయితే ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు.

మరికొందరైతే వీధుల్లో పరుగులు పెట్టారు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజె ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజస్థాన్‌లో జైపూర్‌తో సహా ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోని నొగొపా ప్రాంతంలో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్