వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడిందని వివరించింది. ఇది మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వర్షాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీయడంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడినట్టు వెల్లడించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్