స్వతంత్ర వెబ్ డెస్క్: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్బులను కూడా తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 16 ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల 17 సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ తో పాటు మద్యం సర్వ్ చేసే అన్ని రకాల వ్యాపారాలు మూతపడనున్నాయి. జంటనగరాల్లో ఏటా ఆషాడ మాసంలో జరిగే బోనాల పండుగ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆదేశాలను అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రెండు రోజుల పటు వైన్స్ షాపులు బంద్
0
520
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


