37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

చంద్రయాన్-3 టీం కి ఫ్రాన్స్ నుంచి ప్రధాని శుభాకాంక్షలు

స్వతంత్ర వెబ్ డెస్క్:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ -3ని నింగిలోకి పంపించనున్నారు. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగిస్తారు.

మరికొద్ది నిమిషాల్లో చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ట్విటర్‌లో ఇలా రాశారు. ‘చంద్రయాన్-3 మిషన్‌కు శుభాకాంక్షలు. ఈ మిషన్ గురించి అంతరిక్షం, సైన్స్, ఆవిష్కరణలలో సాధించిన పురోగతి గురించి మరింత తెలుసుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇది మన అందరికీ చాలా గర్వంగా ఉంటుంది అని ప్రధాని అన్నారు.

భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుందని ప్రధాని అన్నారు. చంద్రయాన్ -3, మా మూడవ చంద్ర మిషన్. దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశం యొక్క ఆశలు, కలలను తీసుకువెళ్తుందని ప్రధాని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్