మహబూబ్ నగర్ జిల్లాలో… 16 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

అర్థరాత్రి ఆడవాళ్లు నిరభ్యంతరంగా వెళ్లినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఆనాడు గాంధీజీ చెప్పారు. కానీ నేటి సంఘటనలు చూస్తుంటే మనకి నిజమైన స్వాతంత్రం రాలేదనే అనుకోవాలి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. 16ఏళ్ల బాలికపై సొంత బాబాయ్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడమే కాదు, హత్య కూడా చేయడం అక్కడ సంచలనం సృష్టించింది. దీంతో గ్రామస్తులు దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లపై దాడులు చేశారు. అక్కడే ఉన్న కారుకి నిప్పంటించారు.

బతుకు తెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుకుంటూ ఒక్కరే ఇంటిలో ఉంటోంది. అదును చూసుకుని బాబాయ్ శ్రీనివాస్, అతని స్నేహితులు కలిసి తనపై లైంగికంగా దాడి చేశారు. తను ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారు. ఈ మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్