34.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

ఓ మై గాడ్-2 టీజర్ రిలీజ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: విభిన్న కథాంశంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ చిత్రం 2012లో సూపర్ హిట్ అయింది. వేరే భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ అయింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) పేరుతో ఈ చిత్రం ప్రస్తుతం రూపొందుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఆసక్తిని విపరీతంగా పెంచింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ‘ఈశ్వరుడికి ఆస్తికుడు .. నాస్తికుడు అనే భేదం లేదు .. ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు .. శరణాగతి చేసినవారిని తప్పక రక్షిస్తాడు’ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్టుగా తెలుస్తోంది. యామీ గౌతమ్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ‘ఉజ్జయిని మహాకాళేశ్వరుడు’గా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, మిగతా పనులను జరుపుకుంటోంది. అక్షయ్ కుమార్ – అశ్విన్ వర్దే కలిసి నిర్మించిన ఈ సినిమాకి, అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. ‘ ఓ మై గాడ్’ లో పరేశ్ రావెల్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తే, ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

Latest Articles

నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని..రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించి పాలించడం బీజేపీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాజా చిట్‌చాట్‌లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్