35.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

విడదల రజినికి టీడీపీ నేత సెల్ఫీ ఛాలెంజ్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ మంత్రి విడదల రజినిపై మాజీ మంత్రి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. టీడీపీ చేసిన పనుల్లో 10 శాతమైనా వైసీపీ చేసిందా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో రజని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. పసుమర్రు వంతెన, ఓగేరు వాగు వద్ద ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. రజనికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై ఏమాత్రం లేదని ఆరోపించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిలకలూరిపేట సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయన్నారు. టీడీపీ హయాంలో రూ.16 కోట్లతో ఎస్టీపీ పనులు చేపట్టామన్నారు. పసుమర్రు వంతెన కోసం చంద్రబాబు రూ.7.6 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ వంతెనను పూర్తి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గుత్తేదారుకు రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, బటన్ సీఎంగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్