101వ రోజుకు చేరిన భట్టి పీపుల్స్ మార్చ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: భట్టి విక్రమార్క పాదయాత్ర నిన్నటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు జోష్‌ పెంచుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నేడు కోప్పోలులో ముందుకు సాగనుంది. నేటితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 101వ రోజుకు చేరుకుంది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కోప్పోలు గ్రామంలో ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. నకిరేకల్ నియోజకవర్గం భీమవరం గ్రామం మీదుగా సూర్యపేట్ నియోజకవర్గం ఏదులావారి గూడేంలోకి పాదయాత్ర కొనసాగనుంది. భీమవరంలో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుందని పార్టీ శ్రేణులు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం సైనిక్ పురి కాలనీలో బస చేయనున్నారు.

భట్టి విక్రమార్క పాదయాత్ర నిన్నటితో వందరోజుల పూర్తి చేసుకుంది. నిన్న నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. భట్టి పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెళ్లివిరిసింది. భట్టి విక్రమార్క పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్ పాడు గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. కేతేపల్లి ప్రజలు భట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు #PeopelsMarch100Days అనే హ్యష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యింది. భట్టి పాదయాత్రకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్