14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ట్రేడ్ వరల్డ్ టవర్ సీలో ఈ ఘటన జరిగింది. మొత్తం 14 మందితో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఎలివేటర్‌లోని 14 మందిలో నలుగురికి స్వల్పగాయాలు కాగా.. 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. 8 మంది గ్లోబల్ ఆసుపత్రిలో చేరగా.. ఒకరు కేఈఎమ్ హాస్పిటల్‌లో చేరారు. అయితే స్వల్ప గాయాలైన నలుగురు ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ప్రమాదంలో గాయపడినవారంతా నిలకడగా ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Latest Articles

రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్