స్వతంత్ర వెబ్ డెస్క్: 18 ఏళ్ల కిందట వీడియో పబ్లిషింగ్ సైట్ గా ప్రజల ముందుకి వచ్చిన యూట్యూబ్ ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఒకవైపు ఎలాంటి సమాచారాన్ని అయినా అందిస్తూ.. మరోవైపు కంటెంట్ మేకర్స్ కి ఆదాయాన్ని చేకూరుస్తుంది. ఇదే తరహాలో ఇప్పుడు ట్విట్టర్ కూడా వీడియో యాప్ తీసుకువస్తోంది. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ దీనిపై ప్రకటన కూడా చేశారు. స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ కు రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు. ఎక్కువ లెంగ్త్ ఉన్న వీడియోలను ఫోన్లలో చూడడం కష్టమవుతుంది కనుక, ఈ యాప్ ద్వారా స్మార్ట్ టీవీల్లో పెద్ద వీడియోలను సులువుగా వీక్షించవచ్చు. ట్విట్టర్ లో ప్రస్తుతం 2 గంటల నిడివి ఉన్న వీడియోలను పోస్టు చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని గత నెలలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు.
యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ సరికొత్త యాప్
0
497
Previous article
Next article
Latest Articles
టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?
ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -
- Advertisement -


