పూరీ యాత్రకి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఓడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రకి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ యాత్ర కోసం దెస నల్లమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి చేరుకోనున్న నేపథ్యంలో వారికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలను తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో రోజున పూరీ జగన్నాథుడిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్నాథుడితో పాటు బలరాముడు, సుభద్రలను వేర్వేరు రథాల మీద పూరీ నగరంలో ఊరేగిస్తారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా భావిస్తారు. ఉత్సవ మూర్తులకు సాక్షాత్ గర్భగుడిలో ఉండే స్వామివార్లనే ఊరేగించడం దీని ప్రత్యేకత.

అయితే ఈ యాత్ర కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. పూరిలో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు జూన్ 18, 19, 20, 21, 22 తేదీల్లో నడుస్తాయని ప్రకటించారు. వీటిలో సికింద్రాబాద్-మాలతిపట్ పూర్, నాందేడ్-కుర్దారోడ్, కాచిగూడ, మాలతిపట్ పూర్ వంటి స్టేషన్ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో షాలీమార్-హైదరాబాద్, సత్రగాచి-తిరుపతి, గౌహతి-సికింద్రాబాద్, హౌరా-పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్- సత్రగాచి, మైసూర్-హౌరా, సికింద్రాబాద్-ఆగ్రాతో పాటు ఎర్నాకులం-హౌర్ స్టేషన్ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్