స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢీల్లీ కాల్పుల శబ్దాలతో అట్టుడికిపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. నైరుతి దిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. కాల్పులకు సంబంధించి తెల్లవారుజామున 4.40 గంటలకు ఆర్కే పురం పోలీసు స్టేషన్‌కు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పుల్లో పింకీ(30), జ్యోతి(29) అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. డబ్బు సెటిల్మెంట్ వ్యవహారం దీనికి కారణం కావొచ్చు. అయితే.. విచారణ అనంతరం దీని వెనక ఉన్న కచ్చితమైన కారణం తెలుస్తుంది’ అని తెలిపారు.