బాలీవుడ్‌లో ఫేవరెటిజం కొత్తేమీ కాదు..

స్వతంత్ర వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో క్యాంపులు, ఫేవరెటిజం కొత్తేమీ కాదని, అవి ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఈ విషయం తనకి ముందే తెలుసనీ నటి తాప్సీ పన్ను అన్నారు. గతంలో సిటడెల్‌ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ప్రమోషన్స్‌లో భాగంగా కొంత కాలం క్రితం ఇండియాకు వచ్చిన ప్రియాంక.. బాలీవుడ్‌పై కీలక ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో కొంతమంది తనని పక్కన పెట్టేశారని, తనకు అవకాశాలు రాకుండా చేశారని, అందుకే తాను హాలీవుడ్‌కు వెళ్లిపోయానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ బాలీవుడ్‌లో క్యాంపులు కొత్తేమీ కాదన్నారు. చిత్ర పరిశ్రమలో పక్షపాత ధోరణి ఉంటుందనే విషయం తనకు గతంలోనే తెలుసన్నారు. బీటౌన్‌లో క్యాంపులు, ఫేవరెటిజం ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. నటీనటుల స్నేహితులు, లేదా వాళ్ల ఏజెన్సీలు.. తమ సినిమాల్లోకి ఎవరిని తీసుకోవాలనుకుంటే వాళ్లనే తీసుకుంటారు. అది వాళ్ల కెరీర్‌కు సంబంధించిన విషయం కాబట్టి వాళ్లను తప్పుపట్టడానికి లేదు. ఈ పరిశ్రమలోకి వచ్చే ముందే ఇక్కడ పక్షపాత ధోరణి ఉంటుందని నాకు తెలుసు. అయితే, ఈ ఆటలో మీకు అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ ఇక్కడే ఉండాలనుకుంటే అది మీ సొంత నిర్ణయం. తర్వాత, మీరు విమర్శించలేరు’’ అని తాప్సీ తెలిపారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్