స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగనున్న ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్, ఆసియా కప్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు వెసులుబాటు కల్పించింది. క్రికెట్ లవర్స్‌కు చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే మొబైల్‌తో పాటు, ట్యాబ్‌లలో చూసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. అక్టోబర్ 5న ప్రారంభంకానున్న వరల్డ్‌కప్ టోర్నమెంట్ నవంబర్ 19 వరకు కొనసాగనుంది. 10 దేశాలు తలపడనున్న ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక సెప్టెంబర్‌లో ఆసియా కప్ టోర్నీ మొదలుకానుంది. కాగా జియో సినిమా ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా అందించి తన సబ్‌స్క్రైబర్స్ సంఖ్యను భారీగా పెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు డిస్నీ హాట్‌స్టార్ కూడా ముందుకొచ్చింది.


