స్వతంత్ర వెబ్ డెస్క్: చెరువుల పండుగలో అపశృతి.. గంగులకి తప్పిన ప్రమాదం కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్‌లో జరిగిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అక్కడే ఆయనకు ప్రమాదం తప్పింది. చెరువుల పండుగలో భాగంగా ఆయన నాటు పడవలో ప్రయాణించారు. అది కాస్త నీటిలో మునగడంతో ప్రమాదం జరిగింది. పడవ నీటిలో మునగడంతో మంత్రి గంగుల నీట మునిగిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ని పైకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా షాక్ తిన్నారు. మంత్రి కూడా కాసేపు షాక్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకొని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అప్పటి వరకు సరదాగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా జరిగిన చిన్న అపశృతితో గందరగోళం నెలకొంది. అక్కడ వారికి ధైర్యం చెప్పిన గంగుల తిరిగి కార్యక్రమంలో జోష్ ను నింపారు.
మంత్రి గంగులకి తృటిలో తప్పిన ప్రమాదం..
0
708
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


