స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన హస్తిన పర్యటనకు వెళ్లారు. అయితే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ మేరకు అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రెండు వర్గాలుగా విడిపోయినట్లు కేంద్రం పెద్దల దృష్టికి వచ్చిందని.. దీంతో విభేదాలను చక్కబెట్టేందుకే ఈటలను పిలిచినట్లు కమలం నేతలు చెబుతున్నారు.
ఈటలకు ఢిల్లీ నుంచి పిలుపు.. కీలక పదవి ఇచ్చే ఛాన్స్!
0
578
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


