స్వతంత్ర వెబ్ డెస్క్: సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ని తెరకెక్కించిన రాజ్ & డీకే దర్శకత్వంలో సిటాడెల్ ఇండియన్ సిరీస్ తెరకెక్కుతుండగా.. దీనిలో వరుణ్ ధావన్, సమంత మెయిన్ లీడ్స్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా ‘సిటాడెల్’ టీం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు. సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం రాష్ట్రపతిని సెర్బియాలో కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు. సిటాడెల్ సిరీస్ గురించి, పలు సినిమాల గురించి మాట్లాడారు సిటాడెల్ యూనిట్. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను వరుణ్ ధావన్, రాజ్ & డీకే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు కూడా చేశాడు. ‘సిటాడెల్ టీం ఇండియా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ మతి ద్రౌపతి ముర్ము గారిని కలిసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. సెర్బియాలో ద్రౌపతి ముర్ముజీ మేడం మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం’ అంటూ తెలిపారు. ఇక సిటాడెల్ టీం తో ద్రౌపది ముర్ము కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.