మొదలైన చేప మందు పంపిణీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు బత్తిని హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప మందు పంపిణీని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉబ్బస వ్యాధి గ్రస్థులు చేప మందు కోసం తరలిరావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జీహెచ్‌ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. మత్స్యశాఖ 2.50 లక్షల కొర్రమీను చేపపిల్లలను సమకూర్చింది. బత్తిని కుటుంబీకులు సుమారు 5 లక్షల మందికి సరిపడేలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం అదనంగా గాంధీసెంటినరీ హాల్‌ వైపు అయిదు ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. చేప ప్రసాదాన్ని గర్భిణులు మినహా అందరూ స్వీకరించవచ్చని బత్తిని కుటుంబీకులు స్పష్టం చేశారు. బత్తిన కుటుంబ సభ్యులు 178 ఏళ్లుగా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 18 క్యూ లైన్లు, 32 చేప మందు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్