స్వతంత్ర, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదు బృందాలు తనిఖీలు జరుపుతుతున్నారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వీసీ రవీందర్ గుప్తా, పాలక మండలి (ఈసీ) మధ్య వార్ నెలకొంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని గతంలోనే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో వర్సిటీలో పాలన గందరగోళంగా మారింది.
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్, ఈడీ సంయుక్త దాడులు
0
426
Previous article
Next article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


