స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశమంతటా కంటతడి పెట్టించింది. ఈ ఘటన నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం జరిగింది. డుంగురి నుంచి బార్ఘాడ్ స్టేషన్‌కు లైమ్‌స్టోన్ మోసుకెళ్తున్న గూడ్స్ రైలు మెందపల్లి సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలు వేగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 108 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
0
283
Previous article
Next article
Latest Articles
పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్- మహేశ్ కుమార్ గౌడ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్ అన్నారు.
కమల కళ్యాణ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని...
- Advertisement -
- Advertisement -


