భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: మన దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పడి 170 సంవత్సరాలు దాటింది. ఇన్ని దశాబ్దాల చరిత్రలో భారత రైల్వే కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు కీలక రవాణా మార్గంగా మారింది. ఈ క్రమంలో మానవ తప్పిదాలు, సిగ్నల్ వ్యవస్థ లోపం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నో రైల్వే ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ ఏడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న అత్యంత విషాద రైలు ప్రమాద ఘటనలను ఓసారి తెలుసుకుందాం.

** ధనుష్కోటి ప్రమాదం: 1964 డిసెంబర్ 23న తమిళనాడులోని ధనుష్కోటిలో భారీ తుఫాన్ కారణంగా పంబన్- ధనుష్కోటి పాసింజర్ రైలు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 126 మంది ప్రాణాలు కోల్పోయారు.

** భాగమతి ప్రమాదం: 1981 జూన్ 6న భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్‌లోని భాగమతి నదిపై ఉన్న వంతెనను దాటుతూ రైలు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 750 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు.

** ఫిరోజాబాద్ ప్రమాదం: 1995 ఆగస్టు 20న ఫిరోజాబాద్ సమీపంలో ఆగి ఉన్న కలింది ఎక్స్‌ప్రెస్‌ రైలును వేగంగా వచ్చిన పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 358 మంది ప్రయాణికులు చనిపోయారు.

** ఖన్నా  ప్రమాదం: 1998 నవంబర్ 26న పంజాబ్‌లోని ఖన్నా ప్రాంతంలో కలింది ఎక్స్‌ప్రెస్‌ను జమ్ముతావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో 212 మంది మృతి చెందారు.

** గౌసల్ ప్రమాదం: 1999 ఆగస్టు 2న కతిహార్ డివిజన్‌లోని గైసల్ స్టేషన్‌లో ఆగి ఉన్న అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ రైలును బ్రహ్మపుత్ర రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 290 మంది మరణించారు.

** రఫీగంజ్ ప్రమాదం: 2002 సెప్టెంబరు 9న బీహార్‌లోని రఫీగంజ్‌లో ధావే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 140 మందికి పైగా మరణించారు

** గోల్కొండ రైలు ప్రమాదం: 2003 జూలై 2న గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద పట్టాలు తప్పి ఇంజిన్, రెండు బోగీలు కిందపడ్డాయి. నాటి ప్రమాదంలో 22 మంది మృతి చెందారు.

** ఝర్‌గ్రామ్ ప్రమాదం: 2010 మే 27న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అంతలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో 148 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

** కాన్పూర్ ప్రమాదం: 2016లో యూపీలోని కాన్పూర్ సమీపంలో ఇండోర్- రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 260 మంది చనిపోయారు.

** ఒడిశా ప్రమాదం: 2023 జూన్ 2న బాలాసోర్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్‌ను ఢీకొట్టడంతో 290మందికి పైగా ప్రాణాలు వదిలారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్