నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: గత రెండు రోజులు నుంచి లాభాల్లో సాగుతున్న స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10:20గంటల సమయంలో సెన్సెక్స్‌ 251 పాయింట్ల నష్టంతో 62,718 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 18,560 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు కుంగి 82.73 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, టైటన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అప్పుల పరిమితి పెంపు బిల్లు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఓటింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మార్కెట్లలో అప్రమత్తత కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్