రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్ష

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌పై శనివారం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సమీక్షలో వేడుకల నిర్వహణ, ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. సమీక్ష అనంతరం దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ ప్రణాళిక చేస్తారు. మంత్రులు, ఉన్నతాధికారుల సలహాలు సూచనలు అనంతరం సీఎం కేసీఆర్ తుది రూపు ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే జూన్ 2 నుంచి 21 వరకు వైభవోపేతంగా రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలు నిర్వహించేందుకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్