జగన్ తో పాపం పసివాడు సినిమా తీస్తారా? పవన్ కౌంటర్ ఎటాక్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మంగళవారం బాపట్ల జిల్లాలో జరిగిన మత్స్యకార సభలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యాఖ్యలకు ట్విట్టర్ లో పవన్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. తాను అమాయకుడు అని జగన్ చెప్పే మాటలకు ‘పాపం పసివాడు’ సినిమా తీయాలని సూచించారు. ‘మన ఏపీ సీఎంతో ఎవరైనా ‘పాపం పసివాడు’ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. అతను చాలా అమాయకుడు. కానీ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతని చేతిలో ‘సూట్‌కేస్’కి బదులుగా, అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ని సులభతరం చేసే బహుళ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచాలని సూచించారు.

ప్రియమైన ఏపీ సీఎం… మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. మీరు అక్రమంగా సంపాదించిన సంపదతో, ప్రజలపై విరుచుకుపడే హింసతో ‘వర్గయుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో రోజు ‘రాయలసీమ’ మీ నుంచి, మీ గుంపు నుంచి విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. పాపం పసివాడు సినిమా కథనానికి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ ఏపీలో నది ఒడ్డున ఇసుకను వైసీపీ దోచుకుంది. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!’ అంటూ ఎద్దేవా చేస్తూ పవన్ ట్వీట్ చేశారు.

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్