తిరుమలలో ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా క్యాలండర్ విడుదల

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంబంధించి క్యాలండర్ విడుదల చేశారు టీటీడీ అధికారులు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి నెల 18వ తేది నుంచి 20 వరకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేస్తారు. 21వ తేదీన నేరుగా వర్చువల్ సేవా టిక్కెట్లతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టిక్కెట్లు విడుదల చేస్తారు. 23వ తేదీన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు. 24వ తేదీన రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తారు. 25వ తేదీన వసతి గదులు కోటా విడుదల చేస్తారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కర్నాటకలో మ్యాజిక్ నెంబర్ కంటే ఎక్కువ స్థానాలలో గెలవబోతున్నామని అన్నారు. మొదటిసారి పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నట్లు వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పేలా ఫలితాలు వుండబోతున్నాయంటూ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోంది.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విజయవాడలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో ప్రజలందరు పాల్గొనాలని హితవు పలికారు. ఆలయాల అభివృద్దికి, భక్తుల సౌకర్యాలపైనే దేవాదాయశాఖ దృష్టి పెట్టిందని అన్నారు. సుబ్రహ్మణ్యం స్వామి ఎందుకు అలా వ్యాఖ్యలు చేసారో తెలియదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్