స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు దర్శకత్వం వహించి నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కేటీఆర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇళయరాజా లాంటి గొప్ప సంగీత విద్వాంసుడితో వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా ఉందన్నారు. అనంతరం ఆయన అంగీకారిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇళయరాజా స్పందిస్తూ మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ లాంటి విద్యలే కాకుండా మ్యూజిక్ కూడా నేర్చుకునేలా ప్రోత్సహించాలని కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు: కేటీఆర్
0
458
Previous article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


