స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఒక బాలికకు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 11 మంది ఉన్నారు. జగతరా సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడం బోలెరోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాంకేర్ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం రాయ్‌పుర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
0
434
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


