స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీ కూలిపోయింది. ఒడిశాలోని అస్కా నుంచి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. భారీ వాహనాలు జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండగా.. లారీ డ్రైవర్ మాత్రం ఇచ్ఛాపురం పట్టణంలోకి వచ్చాడు. ఈ క్రమంలో లారీ బాహుదా నది వంతెనపైకి రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి పడిపోయింది. నదిలో నీరు లేకపోవడం, ఇతర వాహనాలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు మాత్రం స్వల్పగాయాలయ్యాయి. వంతెన కూలిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణంలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 1929లో బాహుదా నదిపై ఈ వంతెనను బ్రిటీష్ పాలకులు నిర్మించారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కూలిన పురాతన వంతెన
0
572
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


