బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టివేసింది. పదో తరగతి హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ప్రధాన నిందితుడిగా బండి సంజయ్‌ను చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం హనుమకొండ జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఈనెల 17న పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు. దీనిపై న్యాయస్థానంలో విచారణ చేపట్టిన హనుమకొండ కోర్టు.. బెయిల్‌ రద్దుకు సహేతుక కారణాలు లేవన్న బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకొని పోలీసుల పిటిషన్‌ను కొట్టివేసింది.

 

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్