శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నేడు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల

Tirumala | ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 56,680 మంది భక్తులు దర్శించుకున్నారు.. అలాగే 18,947 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, వైకుంఠవాసుడి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్ న్యూస్ తెలిపింది. నేడు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నట్లు వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు జూలై మాసంకు సంబంధించిన అంగ ప్రదక్షణ టోకేన్లు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది. అలాగే… మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకు సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్