కేరళలో పెను విషాదం.. బోటు బోల్తా పడి 20మంది జలసమాధి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తువల్‌తీరం బీచ్ సమీపంలో 30మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో జరిగిన ఘటనలో 20మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

మృతుల్లో మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో సరదాగా బోటింగ్ కు వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయారు. పడవ బోల్తా పడడానికి కారణం తెలియరాలేదని మంత్రి అబ్దు రహిమాన్ తెలిపారు. జలసమాధి అయిన వారిలో చాలా మంది పడవ అడుగు భాగంలో చిక్కుకుపోయారని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్