Nandyala జిల్లాలోని డోన్(DHONE) పట్నంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే వ్యక్తులపై కత్తులతో దాడికి దిగారు. తమ దగ్గర కేవలం 350 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పడంతో కత్తులతో తీవ్రంగా దాడి చేసి పరారయ్యారు. అర్ధరాత్రి సమయం కావడంతో బస్టాండ్ లో ఎవరు లేకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో ఉదయం వరకు అక్కడే పడిపోయారు. తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించడంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరు హోటల్లో పని చేస్తుండగా, మరొకరు చెత్త పేపర్లు ఏరుకుంటూ జీవిస్తున్నారు అని పోలీసులు తెలిపారు.
Nandyala | ఇదేంట్రా బాబు.. రూ.350 కోసం కత్తులతో దాడి
0
428
Latest Articles
అల్వాల్‌లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్‌లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


